
జగన్ మాజీ CPRO పూడి శ్రీహరి మరోసారి అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మాజీ చీఫ్ ప్రోటోకాల్ ఆఫీసర్ (CPRO) పూడి శ్రీహరిని గుంటూరు కొత్తపేట పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. కుప్పం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన కొద్దిసేపటికే ఈ అరెస్ట్ జరిగింది. పోలీసులు శ్రీహరిని గుంటూరుకు తరలించారు. ఈ అరెస్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.




