జగిత్యాల తాసిల్ చౌరస్తాలోని శివ సాయి టిఫిన్ సెంటర్‌లో చట్నీలో బల్లి పడటంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనలో టిఫిన్ తిన్న ఇద్దరు చిన్నారులు, ఒక గర్భిణీతో సహా మొత్తం ఎనిమిది మంది వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. బాధితులను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గతంలో అధికారులు ఈ సెంటర్‌ను సీజ్ చేసినా యాజమాన్యం తీరు మారకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.