జగిత్యాల జిల్లా పెగడపల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించిన మల్యాల సిఐ ఎం.రాజ్ కుమార్, శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకమని, సర్కిల్ పరిధిలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై కిరణ్ కుమార్ కూడా ఉన్నారు.