మల్యాల మండలంలో పోలియో కార్యక్రమం విజయవంతం

508చూసినవారు
మల్యాల మండలంలో పోలియో కార్యక్రమం విజయవంతం
జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది. మండలవ్యాప్తంగా 24 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశారు. మల్యాల ఎస్ఐ సందీప్ పోలియో కేంద్రంలో ఆదివారం పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని, మండలంలో ఆరోగ్య వాతావరణం ఉండాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం జమున, ఆశవర్కర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్