
ఆన్లైన్లో రూ.1.87లక్షల ఫోన్ ఆర్డర్.. వచ్చింది చూసి వ్యక్తి షాక్ (వీడియో)
బెంగళూరులో ఆన్లైన్ మోసం కలకలం రేపింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రేమానంద్ అమెజాన్‌లో రూ.1.86 లక్షల విలువైన సామ్సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 ఫోన్ ఆర్డర్ చేశాడు. కానీ డెలివరీ వచ్చిన తర్వాత ప్యాక్ ఓపెన్ చేస్తే, ఖరీదైన ఫోన్‌కి బదులుగా చతురస్రాకార టైల్ వచ్చింది. దీన్ని చూసి షాక్‌కి గురైన ప్రేమానంద్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. BNS సెక్షన్లు 318(4), 319, IT చట్టం 66D కింద కేసు నమోదు చేశారు.




