జగిత్యాల నియోజకవర్గంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కలిసి, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలో దెబ్బతిన్న వంతెనలు, అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్లు, పునరుద్ధరించాల్సిన రోడ్ల సమస్యలను ఆయన మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఈ సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.