రాజీనామా చేయాలి: మున్సిపల్ చైర్మన్

1చూసినవారు
రాజీనామా చేయాలి: మున్సిపల్ చైర్మన్
కాంగ్రెస్ మెట్ ప‌ల్లి ప‌ట్ట‌ణ అధ్య‌క్ష ప‌ద‌వీకి జెట్టి లింగం రాజీనామా చేయాలని మున్సిప‌ల్ చైర్మ‌న్ మైలార‌పు లింబాద్రి కోరారు. ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, లింగం చేసిన ఆరోపణలను ఖండించారు. లింగంకు పార్టీ 30 ఏళ్లుగా పదవులు ఇచ్చిందని, గతంలో కౌన్సిలర్‌గా గెలిచి టిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపారని, దానివల్ల సభ్యత్వం కోల్పోయారని గుర్తు చేశారు. మరో రెండుసార్లు కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా ఓడిపోయారని తెలిపారు. నాయకత్వ లోపం ఆరోపణలు చేసేవారు పదవులు అనుభవించి ఇప్పుడు ఆరోపించడం సరికాదన్నారు. నియోజకవర్గంలో జువ్వాడి నర్సింగరావు నాయకత్వం బలంగా ఉందని, కోరుట్ల, మెట్ పల్లి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ పదవులు గెలుచుకుందని తెలిపారు. ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్