చిన్నపాటి వర్షాలకే నామాపుర్ రోడ్లు బురదమయం

680చూసినవారు
చిన్నపాటి వర్షాలకే నామాపుర్ రోడ్లు బురదమయం
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నామాపుర్ గ్రామంలో చిన్నపాటి వర్షాలకే రోడ్లు బురదమయంగా మారిపోతుండడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నామాపుర్ అనుబంధ గ్రామం గొల్లపల్లిలో మురికినీరు వెళ్లే సౌకర్యం లేకపోవడంతో వర్షపు నీరు రోడ్డుపై నిలిచి ప్రయాణానికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. అధికారులు, పంచాయతీ పాలకవర్గం స్పందించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్