15 ఏళ్లుగా ఇంటి నంబర్లు లేవు: అడిషనల్ కలెక్టర్‌కు వినతి

612చూసినవారు
15 ఏళ్లుగా ఇంటి నంబర్లు లేవు: అడిషనల్ కలెక్టర్‌కు వినతి
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని ఇందిరా నగర్ కాలనీలో గత 15 సంవత్సరాలుగా ఇళ్లకు ఇంటి నంబర్లు కేటాయించకపోవడంతో స్థానికులు సోమవారం జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజ గౌడుకు వినతి పత్రం సమర్పించారు. ఆడేపు రాజమౌళి ఆధ్వర్యంలో అందించిన ఈ వినతిలో, కాలనీలోని దాదాపు 75 ఇళ్లకు నంబర్లు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇంటి పన్నులు చెల్లించలేకపోతున్నారని తెలిపారు. అధికారులు వెంటనే నంబర్లు కేటాయిస్తే మున్సిపాలిటీకి ఆదాయం సమకూరుతుందని, దీనిపై చొరవ చూపాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్