విలేఖరుల సంక్షేమమే మా ఎజెండా: చీటి శ్రీనివాస రావు

225చూసినవారు
విలేఖరుల సంక్షేమమే మా ఎజెండా: చీటి శ్రీనివాస రావు
జగిత్యాల, జనవరి 10: విలేఖరుల సంక్షేమమే తమ ప్రధాన ఎజెండా అని టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాస రావు అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత సమావేశాల్లో చర్చించిన సమస్యలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని, యూనియన్ బలోపేతానికి సభ్యులందరూ కృషి చేయాలని కోరారు. జిల్లాలో సభ్యులకు ఐడి కార్డులు అందజేయడంలో జాప్యం జరిగిందని, నూతన సభ్యత్వాలు పూర్తయ్యాక ఐడి కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.