జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఓపెన్ టెన్త్, ఇంటర్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కో-ఆర్డినేటర్ రవీందర్ బుధవారం తెలిపారు. చదువు మధ్యలో ఆపివేసిన వారికి, టెన్త్ చదివి మానేసిన వారికి ఒకే సంవత్సరంలో టెన్త్, ఇంటర్ పూర్తి చేసే అవకాశం కల్పించారు. ఈ నెల 15 లోగా దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 94902 86541 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.