జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల ఐసిడిఎస్ సూపర్వైజర్ మహేశ్వరి బాల్య వివాహాల వల్ల అనేక అనర్ధాలు ఏర్పడతాయని, వీటిని ప్రతి ఒక్కరు అడ్డుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, మండల అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.