గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బందికి పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని తెలంగాణ గ్రామ
పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల వెంకట రాజo పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాలోని గ్రామపంచాయితీల్లో పనిచేస్తున్న సిబ్బందికి గత 2 నెలల పెండింగ్ వేతనాలు లేక తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకుంటున్నారని పేర్కొంటు జిల్లా పంచాయతీ అధికారికి వర్కర్స్ యూనియన్ ఆద్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ జి. ఓ. నెం. 51ని సవరించి, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలన్నారు.