సుద్దపల్లిలో పోషణ మాసం వేడుకలు

0చూసినవారు
సుద్దపల్లిలో పోషణ మాసం వేడుకలు
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో శనివారం పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ లక్ష్మణ్ మాట్లాడుతూ సమతుల పోషకాహారాలు తీసుకోవడం వల్ల పూర్తి ఆరోగ్యంగా ఉంటారని, అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారాలను తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్