జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని మేజర్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఉపసర్పంచ్ కటకం వినయ్ ఆధ్వర్యంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత
భారత్ నిర్మాణానికి సహకరించాలని వినయ్ తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం జమున, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.