పుస్తక పఠనంతోనే మేధోశక్తి పెంపొందుతుంది..సిఐ కరుణాకర్

0చూసినవారు
పుస్తక పఠనంతోనే మేధోశక్తి పెంపొందుతుంది..సిఐ కరుణాకర్
జగిత్యాల జిల్లా కేంద్రంలో నవచేతన విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంచార పుస్తకాలయ బస్సును సోమవారం సిఐ కరుణాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక కాలంలో పుస్తక పఠనం మానసిక వికాసానికి, మేధోశక్తి పెంపొందించడానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. యువతలో పుస్తకాలు చదివే అలవాటును ప్రోత్సహించేందుకు ఈ సంచార గ్రంథాలయం ఉపయోగపడుతుందని, ఇందులో విజ్ఞానదాయక, సాహిత్య, నవల, విద్యార్థులకు ఉపయోగపడే అనేక రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నేటి డిజిటల్ యుగంలోనూ పుస్తక పఠనం ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.

సంబంధిత పోస్ట్