జగిత్యాలలో ఇల్లు లేని నిరుపేదలకు స్థలాలు కేటాయించాలని వినతి భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపుమేరకు జగిత్యాల టౌన్ కార్యదర్శి మాడిశెట్టి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ కి బుధవారం వినతి పత్రం అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో టౌన్ ఇన్చార్జ్ వెన్న మహేష్, కోరు కంటి శ్రీనివాస్, గుండారపు ధర్మయ్య, ఎండి అతిక్ రజాక్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.