మెట్ పల్లి మండలం మేడిపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు, మాజీ ఎంపిటిసి నాగేష్, ఐకెపి సెంటర్ మహిళలు, రైతులు, మహిళా సంఘాలు, గ్రామస్తులు పాల్గొన్నారు.