అంగన్వాడీ చిన్నారులకు సర్పంచ్ చేతుల మీదుగా ఏకరూప దుస్తులు పంపిణీ

896చూసినవారు
అంగన్వాడీ చిన్నారులకు సర్పంచ్ చేతుల మీదుగా ఏకరూప దుస్తులు పంపిణీ
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం-1లో శుక్రవారం సర్పంచ్ కాశట్టి వీరేశం చిన్నారులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రమ, తల్లులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్