జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామంలోని హెల్త్ సబ్ సెంటర్లో ఆదివారం వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ముంజ మహేశ్వరి ప్రారంభించారు. ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సంధ్య, ఆశ వర్కర్లు సంతోష, మల్లేశ్వరి, లత, అనూష పాల్గొన్నారు.