జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆల్
ఇండియా బంజారా సేవా సంఘం (AIBSS) జిల్లా యువజన అధ్యక్షులు నగావత్ జీవన్ నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సమావేశంలో, గత ఆరు సంవత్సరాలుగా ఎస్టీ కార్పొరేషన్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల బంజారా గిరిజన వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే ఎస్టీ కార్పొరేషన్ నిధులను విడుదల చేయాలని, లేనిపక్షంలో అన్ని ఎస్టీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపడతామని సంఘం హెచ్చరించింది. ఈ డిమాండ్ పై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సమావేశంలో నిర్ణయించారు.