బ్రెయిన్ డెడ్‌గా సుప్రియ: అవయవదానంతో ఆరుగురికి పునర్జన్మ

6చూసినవారు
బ్రెయిన్ డెడ్‌గా సుప్రియ: అవయవదానంతో ఆరుగురికి పునర్జన్మ
జగిత్యాలలోని హనుమాన్‌వాడకు చెందిన 25 ఏళ్ల సుప్రియ, మూడు రోజుల క్రితం నర్సింగాపూర్ బైపాస్ రోడ్డులో స్కూటీ నేర్చుకుంటుండగా ప్రమాదానికి గురైంది. హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం విషమించడంతో వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు. భర్త ప్రవీణ్, కుటుంబసభ్యుల అంగీకారంతో సుప్రియ గుండె, కాలేయం, మూత్రపిండాలు, కళ్లు వంటి అవయవాలను దానం చేశారు. ఈ అవయవదానం ద్వారా ఆరుగురికి పునర్జన్మ లభించింది.

సంబంధిత పోస్ట్