జగిత్యాల జిల్లాలో విషాదం

5చూసినవారు
జగిత్యాల జిల్లాలో విషాదం
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని రాఘవపట్నం గ్రామానికి చెందిన ఆడెపు మధు (28) వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. గత నెలలో స్వగ్రామానికి వచ్చిన మధు, వాకింగ్ ముగించుకుని ఈత కొట్టేందుకు వ్యవసాయ బావిలోకి దిగాడు. ఈ క్రమంలో బావిలోని బండరాళ్లు తగిలి తీవ్ర గాయాలవ్వడంతో, వాటి మధ్యే చిక్కుకుని ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి.

సంబంధిత పోస్ట్