ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హరిణి క్షేత్ర పర్యటన: వరి పొలంలో నాట్లు వేసిన అధికారులు

1చూసినవారు
ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హరిణి క్షేత్ర పర్యటన: వరి పొలంలో నాట్లు వేసిన అధికారులు
జగిత్యాల జిల్లాకు నియమితులైన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హరిణి, ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్, బూరుగుపల్లి గ్రామాల్లో క్షేత్ర స్థాయి పర్యటన చేపట్టారు. ఆమె నేరుగా పొలాల్లోకి వెళ్లి వ్యవసాయ కూలీలతో మమేకమయ్యారు. వరి పొలంలోకి దిగి, మహిళా కూలీలతో కలిసి వరి నాట్లు వేసి, వారి జీవన విధానం, కష్టసుఖాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. స్వయంగా బురదలోకి దిగి నాట్లు వేసిన హరిణి, లంచ్ సమయంలో కూలీలకు పండ్లను పంపిణీ చేశారు. మహిళా రైతులతో సెల్ఫీలు దిగుతూ వారితో సుమారు అరగంట పాటు గడిపారు.

సంబంధిత పోస్ట్