, జగిత్యాల పట్టణంలో బుధవారం వినాయక నిమజ్జనం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నిమజ్జనానికి వచ్చిన భక్తులకు మొక్కలను అందజేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, పచ్చదనాన్ని పెంపొందించడంలో భాగస్వాములు కావాలని సూచించారు. వినాయక నిమజ్జనంతో పాటు పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని అందించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.