ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారక్క జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సెలవు దినం ప్రకటించకపోవడంపై విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ శ్రీ పగుడాకుల బాలస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లకోసారి జరిగే ఈ మహా గిరిజన జాతర తెలంగాణ రాష్ట్రానికి తలమానికమని, లక్షలాది మంది భక్తులు హాజరయ్యే ఈ వేడుకకు తగిన గుర్తింపు ఇవ్వకపోవడం శోచనీయమని ఆయన పేర్కొన్నారు.