
13 ఏళ్ల బాలికపై 30 మంది అత్యాచారం
రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ జిల్లాలో 13 ఏళ్ల బాలిక అక్రమ రవాణా, సామూహిక అత్యాచారం ఘటన తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఇంటి నుంచి తప్పిపోయిన బాలికను రిక్షా డ్రైవర్ కొందరు హోటల్ యజమానులకు అమ్మేశాడు. ఐదు రోజుల్లో 30 మందికి పైగా హోటల్ యజమానులు, మేనేజర్లు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే రూపిందర్ సింగ్ కన్నార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రధాన నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.




