ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య

0చూసినవారు
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో ధనరేకుల రాజేష్ యాదవ్ (36) ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక బుధవారం అర్ధరాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే రాయికల్ ఎస్సై సుధీర్ రావు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడికి భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.