రాయికల్ పట్టణంలోని భీమన్నవాడకు చెందిన ధనరేకుల రాజేశ్ యాదవ్ (36) బుధవారం అర్ధరాత్రి ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న ఎస్సై సుధీర్‌రావు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతునికి భార్య, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనతో పట్టణంలో విషాద ఛాయలు అలముకున్నాయి.