జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో బుధవారం మండల
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ రాములు గౌడ్, పార్టీ మండల అధ్యక్షులు తిరుపతి, నాయకులు ఉన్నారు.