తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ను 'రాజకీయ వ్యభిచారి' అని అభివర్ణించారు. గాంధీభవన్‌లో పార్టీ ఫిరాయింపులపై స్పీకర్‌ను ప్రశ్నిస్తూ, స్పీకర్ పదవికి మచ్చ తెస్తున్నారని ఆరోపించారు. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ కేటీఆర్ ఓటుకు రూ.10 వేలు ఇస్తున్నారని, కేంద్ర నిధులను తినేసి సిరిసిల్లను వరదల్లో ముంచారని ఆరోపించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో సిరిసిల్లకు నిధులు ఇవ్వలేదని, ఆరు గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నారని, కాంగ్రెస్ దొంగ హామీలను నమ్మితే ఐదేళ్ల పాటు ప్రజలు అరిగోస పడతారని వ్యాఖ్యానించారు.