కరీంనగర్: సీబీ-సీఐడీ విచారణకు సీఎం రేవంత్ ఆదేశించడంతో గ్రానైట్ అక్రమ మైనింగ్ వ్యాపారుల్లో వణుకు మొదలైంది. రూ.749 కోట్ల సీనరేజీ ఎగవేత, వేల కోట్ల విలువైన గ్రానైట్‌ను విదేశాలకు తరలించినట్లు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ గుర్తించింది. 1+1 పెనాల్టీ చెల్లించేలా సర్క్యులర్ విడుదలైనా, సీనరేజ్ టాక్స్ ఇంకా చెల్లించాల్సి ఉంది. ఈ స్కాంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.