వాటర్ వార్.. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్

1638చూసినవారు
వాటర్ వార్.. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్
కరీంనగర్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఎల్ఎండీ నీటి నిల్వలపై వాటర్ వార్ కొనసాగుతోంది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మధ్య శనివారం మాటల యుద్ధం జరిగింది. కేసీఆర్ పాలనలో ఎల్ఎండీలో ఎప్పుడూ 10 టీఎంసీల కంటే ఎక్కువ నీరు ఉండేదని గంగుల పేర్కొనగా, దాన్ని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని నరేందర్‌రెడ్డి సవాల్ విసిరారు. ఈ సవాల్‌పై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందోనని ఆసక్తి నెలకొంది.

సంబంధిత పోస్ట్