
మేజర్ గ్రామ పంచాయతీలో 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమం
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం మంగళవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా హనుమాన్ మందిరం పరిసరాల్లో రోడ్లు ఊడ్చి, డ్రైనేజీలను శుభ్రం చేసింది. గ్రామస్థులకు అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, కార్యదర్శి గూరుడు శ్రీనివాస్, ఉప సర్పంచ్ గడ్డం సోమ రెడ్డి, వార్డు సభ్యులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగింది.








































