జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి మాట్లాడుతూ, మెట్ పల్లి పట్టణంలోని 26 వార్డుల ప్రజలు ఇంటి పన్ను చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వం 5 శాతం రిబిట్ ను ప్రవేశపెట్టిందని తెలిపారు. పట్టణ ప్రజలు ఇంటి పన్ను చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మున్సిపల్ ఇంటి పన్నుపై 5 శాతం రిబిట్ చివరి తేదీ 30వ తేదీ వరకు ఉందని, కావున 26 వార్డుల ప్రజలు ఇంటి పన్ను చెల్లించి తగ్గింపు ద్వారా లబ్ది పొందాలని, అలాగే మున్సిపల్ అభివృద్ధికి కృషి చేసిన వారు అవుతారని ఆయన అన్నారు.