మీసేవా కేంద్రాల్లో స్కాలర్షిప్ మంజూరు కోసం దరఖాస్తు చేసుకోండి

0చూసినవారు
మీసేవా కేంద్రాల్లో స్కాలర్షిప్ మంజూరు కోసం దరఖాస్తు చేసుకోండి
జగిత్యాల జిల్లా మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-2027 విద్యా సంవత్సరంలో అర్హత గల విద్యార్థులు స్కాలర్షిప్ కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డా. కే వేంకయ్య గురువారం విలేకరులకు పంపిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  కళాశాలలో బీ. ఏ,. బీ కాం,  సి ఏ ప్రథమ,  ద్వితీయ,  తృతీయ సంవత్సరం చదువుతున్న అర్హత గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆదాయ ధృవీకరణ,  ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం, 10వ తరగతి, ఇంటర్మీడియట్ మార్కుల, కులము, లోకల్ ఏరియా, బోనాఫైడ్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ధృవీకరణ పత్రాలను మీ సేవా కేంద్రానికి వెళ్ళి, ఆన్ లైన్లో అప్ లోడ్ చేయాలని ఆయన విద్యార్థులకు సూచించారు.

సంబంధిత పోస్ట్