జగిత్యాల: అయ్యప్ప స్వామి అలయ కార్యవర్గం సమావేశం

64చూసినవారు
జగిత్యాల: అయ్యప్ప స్వామి అలయ కార్యవర్గం సమావేశం
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయ కార్యవర్గం ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగే ఉత్సవాల నేపథ్యంలో పలు పూజా కార్యక్రమాలు, విధి విధానాలను చర్చించుకున్నారు. అనంతరం నిత్య పూజ నిధి ఏర్పాటు కోసం దాతల సహకారంతో ఆలయానికి నీతి సమకూర్చేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు దొమ్మటి ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.