మందిర నిర్మాణానికి విరాళం అందించిన బాస మానస గోవర్ధన్ దంపతులు

0చూసినవారు
మందిర నిర్మాణానికి విరాళం అందించిన బాస మానస గోవర్ధన్ దంపతులు
జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో సోమవారం, బాస మానస గోవర్ధన్ దంపతులు రూ. 25,116 విరాళంగా ఇచ్చి శ్రీ శివ భక్త మార్కండేయ మందిర పునర్నిర్మాణంలో శాశ్వత సభ్యత్వం పొందారు. ఈ సందర్భంగా పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు ద్యావనపల్లి రాజారాం మాట్లాడుతూ దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు శ్రీ శివభక్త మార్కండేయ శక్తి గణపతి ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు సంకు ఆనంద్, సహాయ కార్యదర్శి గంగుల ప్రసాద్, ప్రచార కార్యదర్శి గజం రవి, ద్యావనపల్లి గణేష్, హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్