కోరుట్ల రామకృష్ణ కళాశాలలో బతుకమ్మ సంబరాలు

483చూసినవారు
కోరుట్ల రామకృష్ణ కళాశాలలో బతుకమ్మ సంబరాలు
జగిత్యాల జిల్లా కోరుట్లలోని స్థానిక రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఆధ్వర్యంలో శనివారం బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తెలంగాణ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాశాల కరస్పాండెంట్ యాద రామకృష్ణ, డైరెక్టర్లు హరిప్రియ అంజయ్య గౌడ్, ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్, ఉపన్యాసక బృందం, మరియు అధిక సంఖ్యలో విద్యార్థినిలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.