జగిత్యాల మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా, 19వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మనపల్లి భారతి, సంతోష్ గురువారం సుమారు 300 మంది మహిళలతో కలిసి ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కాలేజ్ నుండి హనుమాన్ వాడ మీదుగా మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. వారి ప్రచార శైలిని పట్టణ ప్రజలు ఆసక్తిగా తిలకించారు.