
పొగాకు ఉత్పత్తులపై 40% జీఎస్టీ.. నేటి నుంచి అమల్లోకి
కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై విధించిన 40 శాతం జీఎస్టీ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పన్నుతో పాటు అదనంగా ఎక్సైజ్ డ్యూటీ, హెల్త్ సెస్ విధించడంతో సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కాల వంటి వాటి ధరలు భారీగా పెరిగాయి. హానికర ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంది.




