పిల్లలకు సకాలంలో టీకాలు వేయించాలి: డా. గజాల

0చూసినవారు
పిల్లలకు సకాలంలో టీకాలు వేయించాలి: డా. గజాల
మెట్‌పల్లి మండలం, వెల్లుల్ల హెల్త్ సెంటర్‌లో బుధవారం హెల్త్ న్యూట్రిషన్ డే మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా పిల్లలకు ఇమ్యునైజేషన్ నిర్వహించారు. పిల్లలకు సరైన సమయంలో టీకాలు వేయిస్తే ఎలాంటి జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గజాల మేడం సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గూడూరు తిరుపతి, ఏఎన్ఎం సువర్ణ, గ్రామపంచాయతీ జూనియర్ అసిస్టెంట్ సలీం, ఆశ వర్కర్లు సప్న, సుమిత్ర, వసంత లక్ష్మి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్