గంజాయి స్మగ్లర్ల దాడిలో కానిస్టేబుల్ సౌమ్య మృతి: బజరంగ్ దళ్ నిరసన

1చూసినవారు
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో గంజాయి అక్రమ రవాణా స్మగ్లర్ల దాడిలో గాయపడి నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కానిస్టేబుల్ గాజుల సౌమ్య శనివారం రాత్రి మృతి చెందారు. ఈ ఘటనపై విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ మెట్ పల్లి శాఖ ఆధ్వర్యంలో సౌమ్య చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన సౌమ్య పోరాటం యువతకు స్ఫూర్తిదాయకమని, దాడి చేసిన నిందితులను బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్