జగిత్యాల జిల్లా, కోరుట్ల పట్టణంలోని అతిపురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోమాత కోసం రారాజు గంగాధరి భూమయ్య, భక్తుల సహకారంతో ఏర్పాటు చేసిన గోవిందుని గోశాలను తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ
కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు ప్రారంభించారు. ఈ గోశాల ప్రారంభోత్సవం 2026, జూన్ 28న జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్, కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు, ఆలయ చైర్మన్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.