
అమెరికా యుద్ధ విమానాలకు గగనతలం మూసివేసిన ఇటలీ
పశ్చిమాసియాలో ఇరాన్‌తో యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో అమెరికా మిత్రదేశాలు ముఖం చాటేస్తున్నాయి. అమెరికా యుద్ధ విమానాలకు స్పెయిన్ తన గగనతలాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇటలీ కూడా అగ్రరాజ్యానికి షాకిచ్చింది. నాటో అనుబంధ కీలక వైమానిక స్థావరాన్ని అమెరికా వినియోగించుకోడానికి ఇటలీ నిరాకరించింది. ముందస్తు సమన్వయం లేకుండా అమెరికా తన విమానాన్ని సిసిలీలో ఆపేందుకు నిర్ణయించడంపై ఇరాన్ అభ్యంతరం తెలిపినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.




