
వందల మంది దాడి.. తిరగబడిన మహిళ (వీడియో)
బంగ్లాదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆవు దొంగతనం చేశారన్న అనుమానంతో వందలాది మంది రాళ్లు, కర్రలతో ఓ మహిళ ఇంటిపై దాడి చేశారు. దాడి చేసినా ఆ మహిళ తన ఇంటిని, బిడ్డను రక్షించుకోవడానికి తెగువ చూపింది. చేతిలో కత్తి పట్టుకొని శివంగిలా ఎదురుతిరిగింది. కుటుంబ సభ్యులు ఆమెను బలవంతంగా లాక్కెళ్లిన తర్వాత అల్లరి మూకలు ఇంటిని ధ్వంసం చేశాయి. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరలవుతోంది.




