జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా మల్లాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, సేవా మార్గాలను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సోమా అశ్విన్ కుమార్, కార్యదర్శి చింత శశి కుమార్, కోశాధికారి నూనె శ్రీనివాస్, అలాగే శివ రామ్ కిషన్, కస్తూరి సంతోష్, నరంశెట్టి సందీప్ పాల్గొన్నారు.