జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో బుధవారం గంగాపుత్ర సంఘాల ఆధ్వర్యంలో మహాలక్ష్మి అమ్మవారికి ఆషాడ బోనాల పండుగ సందర్భంగా ఘనంగా వేడుకలు జరిగాయి. పట్టణ గంగపుత్రులు గొల్లెళ్లతో ఊరేగింపుగా వెళ్లి పోచమ్మ తల్లివారికి, భూమాత అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి, మహాలక్ష్మి అమ్మవారికి బెల్లపు అన్నంతో బోనాలతో నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో మొదటి బుధవారం రోజున ఈ బోనాలు సమర్పించడం ఆనవాయితీ అని నిర్వాహకులు తెలిపారు.