
మేము అమరావతి బిల్లుకు మద్దతు ఇస్తున్నాం: ఎంపీ మల్లు రవి
అమరావతి బిల్లుకు మద్దతు ఇస్తున్నామని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తెలిపారు. అదే సమయంలో, తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రధాన మంత్రిని కోరారు. ఐఐఎం, స్టీల్ ఫ్యాక్టరీ, సాగునీటి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించడం వంటి పెండింగ్లో ఉన్న అంశాలలో తెలంగాణకు కూడా సమాన న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.




