
అమరావతి బిల్లుకు BRS మద్దతు
అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభలో BRS పార్టీ మద్దతు తెలిపింది. తమ పార్టీ ఎప్పుడూ అమరావతికి వ్యతిరేకం కాదని, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి రాజధాని శంకుస్థాపనలో పాల్గొన్నారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడిగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే, తెలంగాణలోని ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరారు.




